![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1009 లో.... వెంకీ, నందు ఇద్దరు రాజు ఉన్నప్లేస్ కి వస్తారు. వాళ్ళని చూసి రాజు,లక్కీ షాక్ అవుతారు. ఇదేంట్రా మీ తమ్ముడు ఆ అమ్మాయితో వస్తున్నాడు.. నాకు టెన్షన్ అవుతుందని రాజుతో లక్కీ అంటాడు. కొంపదీసి కిడ్నాప్ గురించి తెలిసి మనల్ని పట్టించడానికి తీసుకొని వస్తున్నాడా అని లక్కీ అంటాడు. నందు డోర్ కొడుతుంది. రాజు డోర్ తీస్తుంటే..అప్పుడే వెంకీకి ఫోన్ వచ్చి పక్కకి వెళ్తాడు. రాజు రిలాక్స్ గా ఏంటండి అని అడుగుతాడు. మిమ్మల్ని ఎక్కడో చూసానని నందు అనగానే మొన్న గోల్డ్ షాప్ దగ్గర చూసారు కదా అని లక్కీ అంటాడు. ఎందుకు వచ్చారని నందుని రాజు అడుగుతాడు.
ఒకమ్మాయి కిడ్నాప్ అయింది.. ఈ అమ్మాయే అని రాజుకి తన ఫోన్ లో ఉన్న ఇందు ఫోటోని చూపిస్తుంది. ఆ ఫోటోని చూసి రాజు, లక్కీ షాక్ అవుతారు. మీకు ఎక్కడైనా ఈ అమ్మాయి కన్పించిందా అని నందు అడుగుతుంది. మాకేం కన్పించలేదు.. ఆ రోజు చూసాం అంటే మళ్ళీ ఈ రోజే అని లక్కీ అంటాడు. ఎక్కడైనా కన్పిస్తే చెప్పండి అని నందు అంటుంది. నందు బయటకు వెళ్ళాక వెంకీ వచ్చి రోజా రెస్టారెంట్ లో ఉందట వెళ్దాం పదా అని నందుతో అంటాడు. ఆ తర్వాత అక్కడ నుండి నందు, వెంకీ కలిసి రోజా ఉన్న దగ్గరికి వెళ్తారు. నందు, వెంకీ వెళ్లేసరికి రోజా తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. నన్ను లైఫ్ పార్టనర్ చేసుకోమని రోజా తన బాయ్ ఫ్రెండ్ తో అంటుంది. ఆ మాటలు వెంకీ విని షాక్ అవుతాడు. వెంటనే రోజా దగ్గరికి వెళ్లి ..ఎందుకే నాతో తిరిగావని కోప్పడతాడు. నిన్ను ఎవడు తిరగమన్నాడని రోజా గొడవపడుతుంది. నువ్వు ఒక పాతకాలం మనిషివి అని వెంకీని రోజా తిడుతుంది. దాంతో వెంకీ బాధపడతాడు.
ఆ తర్వాత రాజు, లక్కీ చెస్ ఆడుతారు. వాళ్ళకి తెలియకుండా ఇందు ఫోన్ తీసుకొని.. స్వాతికి చెయ్యాలని చూస్తుంది. అలా ఇందు ఫోన్ తీసుకొని ఫోన్ చేయబోతుంటే అప్పుడే లక్కీ చూస్తాడు. త్వరగా వెళ్లి తన దగ్గర నుండి ఫోన్ లాక్కుంటారు. మా చెల్లికి ఒక ఫోన్ చేసుకుంటానని ఇందు అంటుంది. అవసరం లేదని రాజు కోప్పడతాడు.ఆ తర్వాత నా వల్లే ఇదంతా ఇందుని సంతకం పెట్టకని ఫోర్స్ చేస్తేనే ఇలా జరిగిందని స్వాతితో అపర్ణ చెప్తూ బాధపడుతుంది. అప్పుడే నందు వచ్చి.. నానమ్మ నువ్వు ఏం బాధపడకు అక్కని తీసుకొని వచ్చే బాధ్యత నాది అని మాటిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |